నర్సారావుపేట: గాయపడకుండా తన చేయి అడ్డం పెట్టి గంగిరెద్దును కాపాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  జగన్ శుక్రవారం గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటలో జరిగిన కనుమ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన స్టాల్స్ ను సందర్శిస్తూ వెళ్తున్మన క్రమంలో గంగిరెద్దు ఉన్న స్టాల్ వద్ద ఆగిపోయారు. వైఎస్ జగన్ ను ఆశీర్వదిస్తున్నట్లుగా గంగిరెద్దు తన తలను ఆడించింది. ఈ సమయంలో గంగిరెద్దు తల పక్కన ఉన్న ఫెన్సింగ్ రాడ్ ను కొట్టుకునేదే. అయితే, వెంటనే అప్రమత్తమైన జగన్ తన చేయిని గంగిరెద్దు తలకు ఆడ్డం పెట్టారు. 

ఆ తర్వాత గంగిరెద్దు తలను సున్నితంగా పక్కకు తప్పించాడు. గంగిరెద్దుకు చెందిన వ్యక్తికి జాగ్రత్తగా ఉండాలని జగన్ సూచించారు. అంతకు ముందు జగన్ గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.