ఓటమిపై నేతలు అధైర్యపడవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు సూచించినా ఫలితం ఉండడం లేదు.తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ జనసేను వీడనున్నారు. తిరిగి ఆయన తన సొంతగూటికి చేరుకోనున్నారు. తిరిగి బిజెపిలో చేరబోతున్నారు.
అమరావతి: ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దెబ్బ తగలబోతోంది. శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న జనసేనను వీడేందుకు ఓ సీనియర్ నేత సిద్ధపడ్డారు.
ఓటమిపై నేతలు అధైర్యపడవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు సూచించినా ఫలితం ఉండడం లేదు.తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ జనసేను వీడనున్నారు. తిరిగి ఆయన తన సొంతగూటికి చేరుకోనున్నారు. తిరిగి బిజెపిలో చేరబోతున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి లోకసభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ మధ్య రావెల కిషోర్ బాబు కూడా జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.