Asianet News TeluguAsianet News Telugu

అఖిల: వెటకారానికి ఏం తక్కువ లేదు

  • వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లిపోయారో అర్థం కావడం లేదట.
  • నియోజకవర్గంలో 13 రోజుల వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రోడ్డుషోల్లోను, ఇంటింటి ప్రచారంలో పక్కనే ఉన్న శిల్పా మంత్రి అఖిలకు కనబడలేదట.
  • శిల్పా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారా, లేక బెంగళూరుకు వెళ్లిపోయి వ్యాపారాలు చేసుకుంటున్నారా అంటూ భలేగా జోక్ చేస్తున్నారు. 
Akhila ridicules ycp chief jagan in nandyala

మంత్రి అఖిలప్రియ భలే సెటైర్లు వేస్తున్నారు శిల్పా మోహన్ రెడ్డిపై. నంద్యాల  ఉపఎన్నికను రాష్ట్రం మొత్తం చూస్తోందట. వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లిపోయారో అర్థం కావడం లేదట. నియోజకవర్గంలో 13 రోజుల వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రోడ్డుషోల్లోను, ఇంటింటి ప్రచారంలో పక్కనే ఉన్న శిల్పా మంత్రి అఖిలకు కనబడలేదట. శిల్పా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారా, లేక బెంగళూరుకు వెళ్లిపోయి వ్యాపారాలు చేసుకుంటున్నారా అంటూ భలేగా జోక్ చేస్తున్నారు. 

స్ధానిక-స్ధానికేతర అంశం గురించి మాట్లాడుతూ, ‘ప్రజలకు తెలుసు ఎవరు లోకలో, ఎవరు నాన్ లోకలో’ అని అన్నారు. అంటే మంత్రి ఉద్దేశ్యమేంటి? శిల్పా మోహన్ రెడ్డి నాన్ లోకల్ అని చెప్పటమేనా. ఆమాటకొస్తే టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డే నంద్యాలకు నాన్ లోకలని టిడిపి నేతలే ఆప్ ది రికార్డుగా చెబుతున్న విషయం అఖిల చెవిన పడలేదేమో. పైగా ఇంకా పెద్ద వెటకారమేంటంటే, వైసీపీ అభ్యర్ధి జగన్మోహన్ రెడ్డే అనుకున్నారట అందరూ. ఎందుకంటే, శిల్పా ఎక్కడా కనిపించలేదట. ఎంత వెటకారమో అఖిలకు?

ఇక, పదమూడేళ్లు అధికారంలో ఉండి ఒక్క పని కూడా చేయని శిల్పా ఓట్లు అడగడానికి చాలా ఇబ్బందిపడ్డారని మంత్రి చెప్పటం భలే క్యామిడీగా లేదు. ఓ వైపేమో అసలు ప్రచారంలో శిల్పా కనబడలేదని చెబుతూనే ఇంకోవైపేమో ఓట్లు అడగటంలో అభ్యర్ధి ఇబ్బంది పడ్డారని చెప్పటం విచత్రంగా ఉంది.

సరే, 13 ఏళ్ళు ఏమీ చేయని శిల్పా ఓట్లడగటంలో ఇబ్బంది పడ్డారనే అనుకుందాం? మరి, టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత భూమా నాగిరెడ్డి మాత్రం ఏం ఊడబొడిచేసాడు? పోనీ మంత్రైన తర్వాత అఖిలప్రియ ఉద్ధరించేసిందేముంది నంద్యాలకు. ప్రచారానికి వెళ్లినపుడు అఖిలను జనాలు నిలదీసిందదే కదా? మరి, జనాలకు ఏం సమాధానం చెప్పలేకే కదా ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెళ్లిపోయింది చాలా చోట్ల.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us:
Download App:
  • android
  • ios