తన తండ్రి మరణానికి కారణమైన శిల్పా మోహన్ రెడ్డికే వైసీపీ టిక్కెట్టు ఇచ్చిందంటూ ఆరోపించారు. అఖిల మాట్లాడిన పది నిముషాల్లో భూమా మరణం, భూమా మరణమంటూ పదే పదే సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేసారు. తన తండ్రి మరణానికి శిల్పా మోహన్ రెడ్డే కారణమని ఆరోపించిన అఖిల, ఏ విధంగా కారణమో మాత్రం చెప్పలేదు. అంటే గుడ్డకాల్చి శిల్పా మొహం మీద వేయాలనుకున్న విషయం అర్ధమైపోతోంది.

‘తన తండ్రి భూమా నాగిరెడ్డి మరణానికి శిల్పా మోహన్ రెడ్డే కారణం’..ఇది తాజాగా మంత్రి అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు. శనివారం చంద్రబాబునాయుడు రోడ్డుషోలో మంత్రి మాట్లాడుతూ, తన తండ్రి మరణానికి కారణమైన శిల్పా మోహన్ రెడ్డికే వైసీపీ టిక్కెట్టు ఇచ్చిందంటూ ఆరోపించారు. అఖిల మాట్లాడిన పది నిముషాల్లో భూమా మరణం, భూమా మరణమంటూ పదే పదే సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేసారు.

తన తండ్రి మరణానికి శిల్పా మోహన్ రెడ్డే కారణమని ఆరోపించిన అఖిల, ఏ విధంగా కారణమో మాత్రం చెప్పలేదు. అంటే గుడ్డకాల్చి శిల్పా మొహం మీద వేయాలనుకున్న విషయం అర్ధమైపోతోంది. ఎందుకంటే, ఏనాడు శిల్పా, భూమాలు కలిసి ఒకే పార్టీలో పనిచేయలేదు. ఎప్పుడూ ప్రత్యర్ధులే. ఇక, భూమా మరణానికి చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్న విషయమూ అందరికీ తెలిసిందే.

భూమాను చంద్రబాబు ఎలా ప్రలోభాలకు గురిచేసింది, ఎలా మాట తప్పింది, వారిద్దరి మధ్య జరిగిన గొడవలన్నింటినీ వైసీపీ నేతలు ఇప్పటికే పలుమార్లు మీడియాలోనే చెప్పారు. భూమా మరణించే ముందురోజు రాత్రి కూడా భూమా-చంద్రబాబు మధ్య పెద్ద గొడవ జరిగిందని కూడా వైసీపీ చెబుతోంది. జనాల్లో కూడా అదే ప్రచారంలో ఉంది. కానీ అఖిల మాత్రం నాగిరెడ్డి మరణానికి శిల్పా మోహన్ రెడ్డే కారణమని చెప్పటం విచిత్రంగా ఉంది. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందేందుకే తన తండ్రి మరణాన్ని వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి ఆపాదిస్తున్నట్లే కనబడుతోంది.