రాజంపేట టికెట్ విషయంలో వైసీపీ అధినేత జగన్.. తనకు అన్యాయం చేయరని ఆ పార్టీ నేత ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం రాజంపేటలోని ఓ కళ్యాణ మండపంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాగా.. రాజంపేట టికెట్ అమరనాథ్ రెడ్డికి కాకుండా ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన మేడా ఇస్తారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

కాగా.. దీనిపై తాజాగా మరోసారి అమరనాథ్ రెడ్డి స్పందించారు. కొన్ని సంవత్సరాలుగా తాను పార్టీ కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. పూటకో పార్టీ మారే మేడా మల్లికార్జునరెడ్డి కి టికెట్ కేటాయిస్తే.. రాజంపేటలో వైసీపీ ఓడిపోతుందన్నారు. తనకు జగన్ అన్యాయం చేయరనే నమ్మకం ఉందంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్న ఆయనను కార్యకర్తలు సముదాయించారు.

అమర్ నాథ్ రెడ్డికి కాకుండా.. మేడాకి టికెట్ ఇస్తే.. తామంతా నిరాహార దీక్ష చేస్తామంటూ కార్యకర్తలు హెచ్చరించడం గమనార్హం.