కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి మెట్లమార్గం ద్వారా రాహుల్  కొండపైకి చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు నడిచి తిరుమలకు చేరుకున్నారు. 

నడకమార్గంలో ఎదురయ్యే భక్తులను పలకరిస్తూ రాహుల్ ముందుకుసాగారు . మధ్యలో ఎలాంటి విశ్రాంతి లేకుండా రాహుల్ నడక సాగింది. కొండపై వున్న శ్రీకృష్ణ అతిథిగృహంలో కాస్సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాహుల్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. గత పదేళ్లుగా రాహుల్ ఒక్కసారి కూడా తిరుమలకు రాలేదు. 

సార్వత్రిక ఎన్నికలకు సమయంలో రాహుల్ ప్రచార వేగాన్ని పెంచారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీతో కాంగ్రెస్ మంచి స్నేహాన్ని కొనసాగిస్తోంది. దీంతో రాహుల్ ఏపి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీవారి దర్శనం అనంతరం రాహుల్ సాయంత్రం 4గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.