Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు వైఖరిపై అసంతృప్తి

తమ వద్ద డబ్బు ఉంచుకుని కూడా పంపిణీ చేయటంలేదన్నట్లుగా సిఎం చంద్రబా బు చెప్పటం పట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాంకుల్లో డబ్బులు లేకపోతే తామెక్కడ నుండి తెచ్చి ఇవ్వాలని నిలదీసారు.

aiboa expressed dissatisfaction on Naidu

చంద్రబాబు తీరుపై బ్యాంకు అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనవసరంగా తమపై ఒత్తిడి తెస్తున్నట్లుగా ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబిఒఏ) భావిస్తోంది. తామేదో బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకుని కూడా ఖాతాదారులకు ఇవ్వటం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని వారు ఆక్షేపిస్తున్నారు.

 

ఖాతాదారులు డబ్బులు అందక ఇబ్బందులు పడటంలో తమ పాత్ర ఏమీ లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బ్యాంకు శాఖలకు ఆర్బిఐ తగినంత డబ్బు పంపకపోతే తామేమి చేయగలమని అధికారులు వాపోతున్నారు.

 

దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఏటిఎంల్లో పనిచేస్తున్నవి కేవలం 35 వేలు మాత్రమేనన్నారు. అదేవిధంగా ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంకుకు మాత్రమే ఆర్బిఐ కావాల్సినంత డబ్బులు ఇస్తున్నట్లుగా ఆరోపించారు. మొత్తం అవసరాల్లో బ్యాంకులకు ఆర్బిఐ కేవలం 10 శాతం మాత్రమే పంపుతున్నట్లు చెప్పారు.

 

నోట్ల రద్దు తర్వాత బ్యాంకులపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయిందన్నారు. రోజుకు 14 గంటలు పనిచేస్తున్నట్లు వారు చెప్పారు.

 

తమ వద్ద డబ్బు ఉంచుకుని కూడా పంపిణీ చేయటంలేదన్నట్లుగా సిఎం చంద్రబా బు చెప్పటం పట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాంకుల్లో డబ్బులు లేకపోతే తామెక్కడ నుండి తెచ్చి ఇవ్వాలని నిలదీసారు. సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవటం చంద్రబాబు చెప్పినంత తేలిగ్గా సాధ్యం కాదన్నారు.

 

కార్పొరేట్లు తీసుకున్న రుణాలపై కేంద్రం దృష్టి పెట్టటం లేదన్నారు. విజయ్ మాల్యా నుండి భారీ మొత్తంలో రుణాలు వసూలు కావాల్సి ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా అంబానీ, అదానీలు తీసుకున్న రుణాలను కూడా వసూళ్ళు చేయాలని డిమాండ్ చేసారు. నోట్ల రద్దు వల్ల సామాన్యుల కష్టాలు మరింత పెరిగినట్లు ఎఐబిఒఏ అంగీకరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios