Asianet News TeluguAsianet News Telugu

అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ పై వెనక్కి తగ్గిన జీఎస్ఎల్ సంస్థ

 అగ్రిగోల్డ్ ఆస్థుల టేకోవర్ పై జీఎస్ఎల్ సంస్థ మళ్లీ వెనకడుగు వేసింది. తాము అగ్రిగోల్డ్ ఆస్తులను తీసుకోలేమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందు వల్ల అగ్రిగోల్డ్ ఆస్థులను టేకోవర్ చేయలేమని జీఎస్ ఎల్ సంస్థ చేతులెత్తేసింది. 

agri gold issue
Author
Amaravathi, First Published Sep 18, 2018, 9:24 PM IST

అమరావతి:  అగ్రిగోల్డ్ ఆస్థుల టేకోవర్ పై జీఎస్ఎల్ సంస్థ మళ్లీ వెనకడుగు వేసింది. తాము అగ్రిగోల్డ్ ఆస్తులను తీసుకోలేమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందు వల్ల అగ్రిగోల్డ్ ఆస్థులను టేకోవర్ చేయలేమని జీఎస్ ఎల్ సంస్థ చేతులెత్తేసింది. 

తాము ఈ డీల్ ను ఉపసంహకరించుకుంటున్నట్లు తెలిపింది. తాము డిపాజిట్ చేసిన రూ.10కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టుకు విన్నవించుకుంది. అయితే జీఎస్ఎల్ సంస్థ వాదనలు విన్న హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

మరోవైపు జీఎస్ఎల్ గ్రూప్ ప్రతిపాదనలలో హేతుబద్దత లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. సంస్థ అఫిడవిట్ ను పరిశీలిస్తే ఏకపక్షంగా సంస్థకు లబ్ధి చేకూరేలా ఉందని విమర్శించారు. ముందుగా ఆస్తులు అప్పగిస్తే చెల్లింపులు నెమ్మదిగా చెల్లిస్తామన్న సంస్థ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 

నాలుగేళ్లలో విడతల వారీగా చెల్లింపులు చెల్లిస్తామన్న సంస్థ ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్థుల టేకోవర్ అంశానికి సంబంధించి ఆస్థులు ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి రాయితీలు ఇవ్వాలని అడుగుతుందన్నారు.

హైకోర్టు అనుమతిస్తే జిల్లాల వారీగా కమిటీలు వేసి అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కుటుంబరావు తెలిపారు. కోర్టు పర్యవేక్షణలోనే ఆస్థుల వేలానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే కోర్టు తీర్పు కీలకం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios