Asianet News TeluguAsianet News Telugu

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

 భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జీఎంఆర్‌  సంస్థ  ఒప్పందం కుదర్చుకుంది.శుక్రవారం నాడు సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్‌ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

agreement between GMR and AP governement for construction Bhogapuram airport
Author
Amaravathi, First Published Jun 12, 2020, 3:42 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


అమరావతి: భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జీఎంఆర్‌  సంస్థ  ఒప్పందం కుదర్చుకుంది.శుక్రవారం నాడు సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్‌ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

సీఎం ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని జీఎంఆర్‌ ప్రతినిధులు హామీ ఇచ్చారు. దీనికోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నామని జీఎంఆర్‌ ప్రతినిధులు సీఎం జగన్ కు చెప్పారు.

తాము పుట్టిన ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామని జీఎంఆర్ ప్రతినిదులు తెలిపారు. ఉత్తరాంధ్రప్రాంతానికి మంచి సదుపాయం వస్తుందని సీఎం వ్యాఖ్యానించారు.

ఎయిర్‌ పోర్టునుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా, సులభంగా, సౌకర్యంగా చేరుకునేలా రహదారులను నిర్మిస్తామని సీఎం చెప్పారు.
వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.

అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖనగరంతో అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటుపైనా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు జగన్ తెలిపారు. ఈ ఒప్పందంపై  పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాలవలవన్, జీఎంఆర్‌ ఛైర్మన్‌ జీబీఎస్‌. రాజు సంతకాలు చేశారు.

ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ వీ.ఎన్ భరత్ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios