Asianet News TeluguAsianet News Telugu

ఈసారి పీకే కాదు... జగన్ తాత రాజారెడ్డి దిగొచ్చినా టిడిపి గెలుపు ఖాయం..: బుద్దా వెంకన్న

ఆంధ్ర ప్రదేశ్ లో భవిష్యత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని... పీకే కాదు కదా సీఎం జగన్ తాత రాజారెడ్డి దిగొచ్చినా వైసిపి గెలుపు సాధ్యం కాదని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 

Again PK Trick not work in AP...  TDP will return to power in 2024... budda venkanna
Author
Amaravati, First Published Sep 17, 2021, 12:45 PM IST

విజయవాడ: వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేక వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ‎నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని టీడీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి,  బుద్దా వెంకన్న అన్నారు. అందుకే ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కేబినెట్ లో పీకే టీం గురించి, ఎన్నికల్లో పార్టీ గెలపోటముల గురించి చర్చించారని... ఇది సిగ్గుచేటని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో పీకే టీం ను రంగంలోకి దించేందుకు జగన్ సిద్దమయ్యారు... కానీ పీకే కాదు పైనున్న జగన్ రెడ్డి తాత రాజారెడ్డి దిగొచ్చినా 2024లో వైసీపీ ఓటమిని, టీడీపీ గెలుపును అడ్డుకోలేరని బుద్దా జోస్యం చెప్పారు. 

''టీడీపీకి పీకేలు అవసరం లేదు... వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటో పెట్టుకుంటే చాలు టీడీపీ అభ్యర్ధులంతా గెలుస్తారు. ఎవరినైనా ఒకసారే మోసం చేస్తారు? మీ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోయేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా లేరు. గత ఎన్నికల్లో టీడీపీపై, చంద్రబాబుపై పీకే, వైసీపీ నేతలు చేసిన అబద్దపు ప్రచారాల్ని తిప్పికొట్టడటంలో మేం విఫలమయ్యాం. కానీ‎ ఈసారి పీకే ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసినా తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నాం'' అన్నారు. 

''అబద్దపు హామీలతో ఒక్క చాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని బీహార్ కంటే వెనకబడేలా చేశారు. నవరత్నాలు అని చెప్పి ప్రజలను నవ మోసాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి. రెండున్నరేళ్ల పాలనలో  విద్యార్దుల నుంచి నిరుద్యోగులు, రైతులు, మహిళలు అన్ని వర్గాలను మోసం చేశారు. అయ్యో  ఆకలి అనే పరిస్థితి రాష్ర్టంలో ఉంది. ఇక మిగిలిన రెండున్నరేళ్లలో రాష్ర్టం ఎడారిగా మారటం ఖాయం'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

read more  అంబటి అధ్యక్షుడిగా... మల్లెపూల వ్యాపారం కూడా చేయండి జగన్ రెడ్డి..: అయ్యన్న సెటైర్లు

''ఇసుక కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. వీరికి ఉపాధి దొరికితే ఒక్కో కుటుంబానికి సంవత్సారానికి  లక్షలు రూపాయలు వస్తాయి. కానీ సంక్షేమ పధకాల పేరుతో మీరిచ్చే రూ. ‎10 వేలు, 15 వేలు వారికి సరిపోతాయా? ఫించన్  రూ. 3 వేలకు పెంచుతామని కేవలం రూ.250 పెంచారు... ఒక రేషన్ కార్డుకు ఒకటే పించన్ అంటూ ఉన్న పించన్లు తీసేస్తున్నారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''ఫించన్ల విషయంలో పీకే ఏం ప్రచారం చేస్తారు? చంద్రబాబు రూ.250 ఉన్న ఫించన్ ని రూ.2000 లకు పెంచలేదని చెబుతారా?  ఇలాంటి పీకే అబద్దపు ప్రచారాలన్ని తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నాం. గతంలో చంద్రబాబు ఒకే సామాజికవర్గానికి చెందిన 30 మందికి డీఎస్పీ పోస్టులు ఇచ్చారాని తప్పుడు ప్రచారం చేశారు... కానీ వాస్తవంగా అందులో కనీసం ముగ్గురు కూడా ఒకే సామాజికవర్గం వారు లేరు'' అని బుద్దా తెలిపారు. 

''జగన్ పాదయాత్ర ముగిసి కొండమీదకు వెళ్లినపుడు మెట్లపై ఆయనతో పాటు ఎవరు కూర్చున్నారు? వారికి మేం కులాలు ఆపాదించామా? ఎవరూ బాదపడకూడన్నది చంద్రబాబుది మనస్తత్వం. కానీ చంద్రబాబు మంచితనం మీద జగన్ రెడ్డి దెబ్బకొట్టారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మాకు డబ్బులు వద్దని ఈసారి పీకే అబద్దపు ప్రచారాలకు, వైసీపీ మోసపు మాటలకు మోసపోమని ప్రజలు చెబుతున్నారు.  పీకే వచ్చినా జగన్ తాత రాజారెడ్డి దిగొచ్చినా వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జెండా ఎగరటం ఖాయం'' అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios