ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులు నియమించబడ్డ వారు ఒక్కొక్కరిగా వైదొలుగుతున్నారు.

తాజాగా ఏపీ అడ్వకేట్ జనరల్ పదవికి దమ్మాలపాటి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ నెల 23న ఫలితాలు వచ్చిన రోజే ఆయన రిజైన్ చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. 2016 మే నెలలో ఏపీ అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులయ్యారు.