ఎన్నికల అనంతరం తొలిసారిగా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిశారు. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న ఈ నేతలు.. ఒకే వేదికగా కలుసుకున్నారు. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని సరదాగా మాట్లాడుకున్నారు. వీరిద్దరి కలయికకు రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మనవరాలి వివాహం వేదికైంది.
 
నేడు రామోజీ మనవరాలు కీర్తి సుహానా, నవయుగ గ్రూప్స్ చైర్మన్ సి. విశ్వేశ్వరరావు మనవడు రాయల వినయ్‌తో నేడు వైభవంగా జరిగింది. ఈ వివాహానికి చంద్రబాబు, పవన్ ఇద్దరూ హాజరయ్యారు. ఇద్దరూ కలుసుకుని సరదాగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.