Food Poison: ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని తిరుపతిలో యువకుడు మృతి.. షాప్‌లో పోలీసుల తనిఖీలు
తిరుపతి రూరల్‌లో ఓ యువకుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న కాసేపటికే మరణించాడు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యలు హాస్పిటల్‌లో చేర్చారు. అనంతరం, పరిస్థితి విషమించి మరణించాడు. ఫుడ్ పాయిజన్ వల్లే మరణించాడని కుటుంబ సభ్యులు షాప్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ షాప్‌లో తనిఖీలు చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓ యువకుడు కల్తీకి బలయ్యాడు. వంటకాలకు సంబంధించిన ప్రతి ఉత్పత్తుల్లో కల్తీ జరుగుతున్న ఉదంతాలు బయటపడిన సంగతి తెలిసిందే. వంట నూనె మొదలు టీ పొడి వరకు ప్రతి దానిని కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీ చాలా మందిని అనారోగ్యానికి గురి చేస్తున్నది. ఫుడ్ పాయిజన్‌తో హాస్పిటళ్ల పాలవుతున్నారు. తాజాగా, తిరుపతిలో ఓ వ్యక్తి కల్తీ ఫుడ్ తిని మరణించాడు. తిరుపతి జిల్లాలో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న యువకుడు స్వల్ప కాలంలో అనారోగ్యానికి గురయ్యాడు. హాస్పిటల్‌లో చికిత్స చేరిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తిరుపతి రూరల్‌లో కాలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలూరుకు చెందిన 27 ఏళ్ల నరేంద్ర ఓ షాప్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే రుయా హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు.
Also Read: Viveka Case: వివేకా హత్య కేసు విచారణ వాయిదా.. వైఎస్ భాస్కర్ రెడ్డి జైలు నుంచి విడుదల
ఫుడ్ పాయిజన్ కారణంగానే నరేంద్ర చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. నరేంద్ర భుజించిన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన షాప్ పై నరేంద్ర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం, ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ విక్రయించిన షాప్‌లో ఎంఆర్ పల్లి పోలీసులు తనిఖీలు చేశారు.