ఆరు గంట‌ల త‌రువాత స్థానికేత‌రులు ఎవ‌రు ఉండ‌రాద‌ని స్ప‌ష్ట‌మైనా ఆదేశాలు. ఎన్న‌క కోసం అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. 110 పోలింగ్ కేంద్రాలు, 225 పోలింగ్ బూతులను ఏర్పాటు 23వ తేది రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఎవ‌రు ఓపినియ‌న్ ఫోల్స్ వెల్ల‌డించ‌రాదు. అందులో కోసం బ్రెయిల్ లిపిలో ఓటు వేసే స‌దుపాయం. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో ఉంటే ఓటు వేసే అవకాశం. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం.
నంద్యాల పట్టణంలో ఆరు గంటల తరువాత స్థానికేతరులు ఎవరు ఉండరాదని స్పష్టమైనా ఆదేశాలు జారీ చేశారు ఎన్నికలు అధికారి బన్వర్లాల్. ఉప ఎన్నికలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆ ఎన్నిక కోసం నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆయన వివరించారు. నంద్యాల ఎన్నిక సంధర్భంగా ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు, ఎన్నిక నిర్వాహాణ పై పలు విషయాలు వెల్లడించారు.
స్థానికేతరులు తక్షణమే నంద్యాల విడిచి వెళ్లాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల పట్టణ వ్యాప్తంగా మధ్యం షాపులు అన్నీ మూసివేయ్యాలని ఆదేశించారు. 23వ తేది రాత్రి 8 గంటల వరకు ఎవరు ఓపినియన్ ఫోల్స్ వెల్లడించకూడదని, టీవీల ద్వారా ఓటర్లను ప్రభావితం చెయ్యకుండా 16 న్యూస్ ఛానేళ్లకు ముందస్తు హెచ్చరికలు పంపామని తెలిపారు. ఇప్పటి వరకు నంద్యాల్లో కోటి 16 లక్షలు సీజ్ చేశామని చెప్పారు. తమకి వచ్చిన అన్ని పిర్యాదుల పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికలు జరిగే వరకు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని భన్వర్లాల్ ఆదేశించారు.
ఈ నెల 23వ తేదిన ఉప ఎన్నక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యావని పెర్కోన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగుతుందని తెలిపారు. ఎన్నిక కోసం 110 పోలింగ్ కేంద్రాలు, 225 పోలింగ్ బూతులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని కేంద్రాల్లో లైవ్వెబ్ క్యామ్లను అమర్చినట్లు ఆయన తెలిపారు. నంద్యాల ఎన్నికలో నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఓటు వేసిన వ్యక్తి తానే వేసిన పార్టికి ఓటు నమోదైంది, లేనిది తెలుసుకే అవకాశం.. వీవీ ప్యాట్ లో సాధ్యమవుతుంది ఆయన తెలిపారు. అలాగే అందులో కోసం బ్రెయిల్ లిపిలో ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నామని బన్వర్లాల్ తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారు ఓటు వినియోగించుకునే వెసులుబాటు ఉందని ఆయన తెలిపారు.
పోలీంగ్ కోసం నంద్యాలల్లో కట్టుదిట్టమైనా బందోబస్తు ఏర్పాటు చేశామని పెర్కొన్నారు. 2,500 మంది పోలీసులు, ఆరు కంపేనీల పారామిలిటరీ సిబ్బంది, 82 ప్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
మరిన్ని తాజా వార్తా విశేషాలకోసం క్లిక్ చేయండి.
