వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసుకు సంబంధించి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో తన ప్రమేయం ఉంటే తనను ఉరితీయవచ్చని అన్నారు. మరి సీఎం జగన్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే ఏం  చెబుతారని ప్రశ్నించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో తన ప్రమేయం ఉంటే తనను ఉరితీయవచ్చని అన్నారు. మరి సీఎం జగన్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే ఏం చెబుతారని ప్రశ్నించారు. జగన్‌కు సీఎం పదవి వచ్చిందనే తృప్తి లేదని విమర్శించారు. అసంతృప్తి ఉంటే దారుణాలే చేస్తారనే అని విమర్శించారు. వివేకా హత్య కేసులో తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక కూడా వారి పత్రికల్లో అలానే రాస్తున్నారని విమర్శించారు. 

వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారని.. ఆ తర్వాత కొన్ని గంటలకే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హత్య అని మీడియా ముందు చెప్పారని అన్నారు. తనపై, బీటెక్ రవిల పేర్లను కూడా తెరమీదకు తెచ్చారని అన్నారు. వివేకానందరెడ్డి చనిపోయిన రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ పులివెందులకు వచ్చారని అన్నారు. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలతో ముందుగా మాట్లాడి కథ అల్లారని ఆరోపించారు. ఐదు గొడ్డలి పోట్లు పడ్డాయని జగన్ ఎలా చెప్పారని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. చేసినోళ్లు, చేయించినోళ్లు మాట్లాడుకున్న తర్వాతే జగన్ ఆ స్టేట్‌మెంట్ ఇచ్చారని ఆరోపించారు. ఆరోజు సీబీఐ కోరిన జగన్.. తర్వాత ఎందుకు వద్దని అంటున్నారని ప్రశ్నించారు. 

ఈ కేసులో మొదట సీబీఐ విచారణ కోరింది తామేనని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. తనను సీబీఐ అధికారులు రెండు గంటల పాటు విచారించారని తెలిపారు. వివేకానందరెడ్డి ఇంటి వద్ద కుక్కను ఎవరు చంపారు, గొడ్డలి ఎక్కడ కొన్నారో అందరికీ తెలుసునని అన్నారు. సీబీఐ అన్ని కోణాల్లో కేసును విచారిస్తుందని అన్నారు. 
భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల రిమాండ్ రిపోర్ట్‌లలో భాస్కర్ రెడ్డిపై అభియోగాలు మోపారు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే అవినాష్ రెడ్డిని ముందస్తు బెయిల్‌కు వెళ్లారని అన్నారు. వివేకా హత్య కేసు పెద్ద కుట్ర అని సీబీఐకి తెలుసునని అన్నారు. 

వివేక హత్య వెనక మహా కుట్ర ఉందని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారంతా బయటకు వస్తారని అన్నారు. ఈ కేసులో పెద్దవాళ్లు ఉన్నార కాబట్టే మహా కుట్రల అంటున్నారని అన్నారు. సీబీఐ సైలంట్‌గా విచారణ చేస్తుందని అన్నారు.