ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం ఇష్యూ మీద శ్రీరెడ్డి ఫేస్ బుక్ లైవ్ లో సంచలన కామెంట్స్ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి క్రిస్టియన్ మతాన్ని నమ్ముతారు కాబట్టి.. హిందూ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఆయన్ని ఇబ్బందుల్లోని నెట్టాలని కుట్ర చేస్తున్నారా?? అసలు మీకు బుర్ర, బుద్ధి ఉందా? అసలు తినేది అన్నమేనా?? మనిషికే పుట్టారా? అంటూ శ్రీరెడ్డి శివాలెత్తింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని బ్యాడ్ చేసేందుకు కొంతమంది ఇలాంటి నీఛరాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఫేస్ బుక్‌ లైవ్‌లో శివాలెత్తింది శ్రీరెడ్డి. ఆమె మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా విగ్రహాలను ద్వంసం చేస్తున్నారు.. అయితే ఈ ఇష్యూపై నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు... నువ్ వైసీపీ సపోర్ట్ కాబట్టే మాట్లాడటం లేదా? అని అడుగుతున్నారు. నాకు పార్టీ, మత భేదాలు ఉండవు అంది.

నేను హిందువుగా పుట్టాను.. హిందూ ఆచార సాంప్రదాయాలు ఆచరిస్తాను. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎంత పవిత్ర గ్రంధాలో.. వాటిలో మనిషి ఎలా నడుచుకోవాలని చెప్తారో.. అలాగే వేదాలు అనేవి మనిషి పుట్టుక.. ఎలాంటి చేయాలి.. ఏం చేయకూడదు.. వీటితో పాటు ఎలాంటి సమయాల్లో రతి సాగించాలి. ఎలాంటి సమయాల్లో రతి సాగించకూడదు.. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి.. పెళ్లంతో ఎలా ఉండాలి అన్నీ రామాయణంలోనూ హిందూధర్మంలోనూ ఉంది.

ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి.. ఆయన క్రిస్టియన్ మతాన్ని నమ్ముతారు కాబట్టి.. ఒక క్రిస్టియన్ ఇలాంటివి చేస్తారు.. వాళ్లే వెనకను ఉండి చేయిస్తున్నారు అని ప్రజలను నమ్మించడానికి మభ్యపెట్టడానికే ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కుట్ర చేస్తున్నారని నేను నమ్ముతున్నా.

వైఎస్ఆర్సీపీలో లక్షల మంది ఉన్నారు.. వాళ్లందరికీ ఫోన్లు చేసి జగన్ గారు చెప్తారా?? లేదంటే ప్రతి విగ్రహానికి సీసీ కెమెరాలు పెట్టడం సాధ్యం అవుతుందా?? ఇది కంప్లీట్‌గా జగన్ మోహన్ రెడ్డిగారిని టార్గెట్ చేయడానికి రాజకీయం చేస్తున్నారు.

ఇది రాజారెడ్డి గారి రాజ్యం అనుకుంటున్నావా?? ఒక అమ్మాయి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.. పేకాటలు, రేప్‌లు అంటూ ఏదేదో చెప్తుంది.. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జగన్ గారు వచ్చిన తరువాతే వచ్చాయా?? కొన్నేళ్లుగా ఈ ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. ఎవరు పాలించినా వస్తాయి. రాజకీయాలను పక్కనపెట్టి.. విగ్రహాల ధ్వంసం ఇష్యూలో జగన్ గారిని టార్గెట్ చేయడం ఎంత వరకూ కరెక్ట్. ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందా?? ఈ ప్రశ్నించేవాళ్లకి.

విగ్రహాలు ద్వంసం చేసినవాడు ఖచ్చితంగా దొరుకుతాడు.. వాడి తాట తీస్తారు.. అప్పటివరకూ మీ నోళ్లు మూత ఎందుకు పడటం లేదు.. ఎందుకు రాజకీయం చేస్తారు. నమ్మకాలతో ఎందుకు ఆడుకుంటారు. రాజకీయంగా ఢీ కొట్టలేక ఇలాంటి నీఛమైన పనులు చేస్తున్నారు. రథాలు తగలబెట్టడం.. రాముడు తల నరకడాలు ఏమిటివి?? అసలు బుద్ధి ఉండే చేస్తున్నారా??

ఎవడో వెధవ డబ్బులిచ్చి చేయమంటే ఇలాంటి పనులు చేస్తారా? మనిషికేనా మీరు పుట్టింది.. నిజంగా చెప్తున్నా.. వాడు కనుక దొరికితే రాముడి తల తీసినట్టే వాడి తల కూడా తీసిపారేయండి. హిందూ విగ్రహాలను టచ్ చేయాలంటే భయం పుట్టాలి వీడి చావు చూసి.

ఈ మత రాజకీయాలు చేసేవాడు కూడా ఒక హిందువే. నేను ఖచ్చితంగా చెప్తున్నా.. ఇది వైసీపీ వాళ్లు చేసేది కాదు.. ఆయన్ని దిగజార్చడానికే ఇలాంటివి చేస్తున్నారు. హిందువులే ఇది చేస్తున్నారు. రాజకీయంగా జగన్‌ని ఎదుర్కొనలేక హిందువులుగా ఉండి నాటకాలు ఆడుతున్నారు. ఇది క్రిస్టియన్, ముస్లింలపై రుద్దుతున్నారు. నేను మా అమ్మకి పుట్టినప్పటి నుంచీ హిందువుగానే ఉన్నాను.. హిందువుల జోలికొస్తే పగిలిపోద్ది నా కొడకల్లారా?? నా క్యారెక్టర్ ఏంటి?? నా ఫిజిక్ ఏంటి అది నెక్స్ట్ ఫస్ట్ నేను హిందు.. నేను హిందుత్వాన్ని నమ్ముతున్నా.

జగన్ ఒక క్రిస్టియన్ అని ఆయన్ని నేను రెస్పెక్ట్ చేయడం లేదు.. మనిషికి రెస్పెక్ట్ ఇస్తా. నేను ప్రతి మతానికి రెస్పెక్ట్ ఇస్తా. ఇది పొలిటికల్ డ్రామా. వాళ్ల దగ్గర అన్ని అస్త్రాలు అయిపోతే ఇప్పుడు మతాలని తెరపైకి తీసుకువచ్చారు. ఒక పొలిటికల్ లీడర్‌ని నాశనం చేయాలంటే హిందువుల్ని రెచ్చగొట్టాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే జగన్ క్రిస్టియన్ కాబట్టి. కాస్తైనా బుర్ర ఉందా..? మనిషి పుట్టుకే పుట్టారా?? ఇలాంటి పిచ్చపనులు చేస్తారా?? ఇంత ఏజ్ వచ్చిన తరువాత కూడా రాజకీయాల్లో ఇలాంటి పెంట పనులు చేయిస్తారా? మీరూ మీరూ కొట్టుకుని చావండి. దేవుళ్లును ఎందుకు తీసుకువస్తున్నారు.

మీరు ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఉంటే.. మీరు నిజంగా మగవాళ్లే అయితే డైరెక్ట్‌గా కొట్టుకోండి. అప్పుడు తేలిపోద్ది.. ఎవడు మగాడో. ధర్మం కోసం జీవితాన్ని త్యాగం చేసిన రాముడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తారా?? పాపం చేయొద్దని హిందూ ధర్మం చెప్పింది.. హిందూ ధర్మంలో పుట్టి ఇలాంటి పనులు చేస్తారా?? నేను రాజకీయాలు మాట్లాడటం లేదు.. హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుతున్నా’ అంటూ ఫైర్ అయ్యారు శ్రీరెడ్డి.