పవన్ చాలా చిన్నవయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టారని, ఆయన ప్రసంగాలు వినడానికి చాలా బాగుంటాయని సుమన్ పేర్కొన్నారు. యూత్ లో పవన్ కి ఫాలోయింగ్ ఎక్కువగా ఉందన్నారు. 

సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారని మరో సీనియర్ సినీ నటుడు సుమన్ అన్నారు. సుమన్ సినీరంగంలోకి అడుగుపెట్టి 4దశాబ్దాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆయనకు గుంటూరులో ఆయన అభిమానులు ఘనంగా సన్మానం చేశారు.

ఈ నేపథ్యంలో.. ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారికి జాతకం, గ్రహబలం ఉంటే.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

అంతేకాకుండా పవన్ చాలా చిన్నవయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టారని, ఆయన ప్రసంగాలు వినడానికి చాలా బాగుంటాయని సుమన్ పేర్కొన్నారు. యూత్ లో పవన్ కి ఫాలోయింగ్ ఎక్కువగా ఉందన్నారు. దానితోపాటు జాతకబలం కూడా ఉంటే.. ఆయన సీఎం కావడం తథ్యమన్నారు. గతంలో ముఖ్యమంత్రి అయినవారందరూ వారి గ్రహ బలం బాగుండటం వల్లనే సీఎం కుర్చీలో కూర్చోగలిగారని పేర్కొన్నారు.