చెన్నై:  నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే సినీనటి శ్రీరెడ్డి తాజాగా మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే ఈసారి చేసింది సినీరంగానికి చెందిన వ్యక్తినే.  ఆ సినీనటుడికి రాజకీయాలను జోడిస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. 

హీరో శివాజీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ప్రశ్నలు వేయండి తప్పు లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే జగన్ గురించి అతిగా మాట్లాడితే మీ నమూనాని ప్రజలు మరచిపోయేలా చేస్తాం అంటూ శ్రీరెడ్డి హీరో శివాజీకి వార్నింగ్ ఇచ్చారు. 

ఇకపోతే హీరో శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీవీ9 కి సంబంధించి ఒక కేసులు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.