తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు నటుడు పృథ్వి. వైఎస్ జగన్ సీఎం కావాలంటూ అలిపిరి నుంచి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు.
 
30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు ప్రేక్షకలును మెప్పించిన పృథ్వీ వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం శ్రమించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం షూటింగ్ లకు సైతం విరామం చెప్పారు. 

వైఎస్ జగన్ సీఎం అంటూ పలు రకాల సర్వేలు వెలువడుతుండటంతోపాటు ఆయా పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ సీఎం కావాలి అంటూ కాలినడకన అలిపిరి నుంచి తిరుమల వెల్లి స్వామివారిని ద‌ర్శించుకున్నారు పృథ్వి. 

తాను తొలిసారిగా కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నానని వైఎస్ జగన్ సీఎం అయ్యే క్రమంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. జగన్ సీఎం అయితే తాను తలనీలాలు సమర్పిస్తానని కూడా మెక్కుకున్నట్లు తెలిపారు. పృథ్వీ వెంట కమెడియన్ జోగినాయుడు సైతం స్వామివారిని కాలినడకను దర్శించుకున్నారు. 

 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి