ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణకు ముద్రగడ పద్మనాభాన్ని ఆహ్వానించకపోవడం పట్ల సినీ నటుడు మోహన్ బాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం మోహనబాబు చేతుల మీదుగా దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కాగా.. అక్కడే బస చేసిన మోహన్ బాబుని ఆదివారం ముద్రగడ పాలకొల్లులో కలిశారు. విగ్రహావిష్కరణకు ఎందుకు రాలేదని ఈ సందర్భంగా మోహన్ బాబు.. ముద్రగడని ప్రశ్నించగా.. తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు. దీనిపై మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడను కూడా ఆహ్వానించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

దాసరి తనకు గురువు అయితే.. ముద్రగడకు సన్నిహితులని ఈ సందర్భంగా మోహన్ బాబు పేర్కొన్నారు. కాగా.. వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.