తాడేపల్లి:వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని సినీ హీరో మంచు విష్ణు దంపతులు కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జగన్ ను కలిసి అభినందనలు తెలిపారు. 

మరికొన్ని గంటల్లో అంటే 12.23 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో ఆయన ప్రమాణ స్వీకారానికి ఇద్దరు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు భార్య విరానికా వైయస్ జగన్ కు చెల్లెలు అవుతుంది. 

ఈ నేపథ్యంలో ఇంటి ఆడపడుచుగా వైయస్ జగన్ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా షర్మిలతోపాటు ఆమెది అగ్రస్థానమే. అయితే జగన్ ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో జగన్ కుటుంబ సభ్యురాలిగా ఆమె ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించి తొలిసారిగా లోటస్ పాండ్ కు చేరుకున్న జగన్ దంపతులను హీరో మంచు విష్ణు దంపతులు కలిశారు. అభినందనలు కూడా తెలిపారు. తాజాగా నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.