టీడీపీ ఎమ్మెల్యే , సినీనటుడు బాలకృష్ణ ముద్దుల కుమార్తె ,  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు బ్రహ్మణి పై హీరో మంచు మనోజ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె ఓ ఆడ సింహం అంటూ కితాబు ఇచ్చారు.  ఇంతకీ మ్యాటరేంటంటే..తిత్లీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.

 

కాగా శ్రీకాకుళం  జిల్లాలోని తొమ్మిది గ్రామాలను బ్రాహ్మణి దత్తత తీసుకున్నారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మనోజ్‌ ఆమెను అభినందించారు. ‘శ్రీకాకుళం కోసం నారా బ్రాహ్మణి తనవంతు సాయం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. నాకు తెలిసిన దృఢమైన మహిళల్లో ఆమె ఒకరు. అవసరంలో ఉన్నవారి కోసం సాయం చేయడానికి ముందు రావడం నిజంగా అభినందించాల్సిన విషయం. సింహం కూతురు ఎప్పటికీ ఆడ సింహమే.. జై బాలయ్య’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.