జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన సోదరుడు, సినీనటుడు నాగబాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు పవన్ కల్యాణ్. అలాగే నెల్లూరుకు చెందిన వేములపాటి అజయ్ కుమార్‌కి కూడా పవన్ కల్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు.

మరికొద్దినెలల్లో ఏపీ , తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన సోదరుడు, సినీనటుడు నాగబాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా నాగబాబు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు జనసేన ఎన్ఆర్ఐ విభాగం, అభిమానులను నాగబాబు సమన్వయ పరిచే బాధ్యత కూడా నాగబాబుకు అప్పగించారు పవన్. అలాగే నెల్లూరుకు చెందిన వేములపాటి అజయ్ కుమార్‌కి కూడా పవన్ కల్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ మీడియాకు జనసేన పార్టీ తరపున అధికార ప్రతినిధిగా సేవలు అందించడంతో పాటు రాజకీయ శిక్షణ తరగతులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ బాధ్యతలను అజయ్ కుమార్‌కి అప్పగించినట్లుగా తెలుస్తోంది. 


Scroll to load tweet…