ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు ఫిష్ వెంకట్ కలిశారు. 


విశాఖపట్నం‌: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు ఫిష్ వెంకట్ కలిశారు. పాదయాత్రకు ఫిష్ వెంటక్ తన సంఘీభావం ప్రకటించారు. 

265వ రోజు ప్రజాసంకల్పయాత్రను వైఎస్‌ జగన్‌ భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం నుంచి ప్రారంభించారు. మార్గ‌మ‌ధ్య‌లో వెంక‌ట్, వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి మ‌ద్ద‌తు తెలిపారు. జగన్ తో పాటు కొంతదూరం పాదయాత్రలో పాల్గొన్న వెంకట్ పలు అంశాలపై జగన్ తో చర్చించారు. 

ఫిష్ వెంకట్ తెలుగు సినీ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా, విలన్ గా ప్రేక్షకుల మన్నలను అందుకుంటున్నారు. టాలీవుడ్ లో వివిధ పాత్రల్లో నటించిన ఫిష్ వెంకట్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అయితే జగన్ పాదయాత్ర సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు పోసాని కృష్ణమురళీ, ఛోటాకె నాయుడు, పృధ్వి తాజాగా ఫిష్ వెంకట్ కలిసి మద్దతు ప్రకటించారు.