అమరావతి: ప్రముఖ సినీనటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో తాగునీటి సమస్యలపై ఏకరువు పెట్టుకున్నారు. 

ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలసి సీఎం జగన్ ను కలిశారు. తాండవ జలాశయంలోని అదనపు జలాల సమకూర్చడానికి విశాఖ జిల్లా చిన గొలుగొండపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పద్దతిని ఏర్పాటు చేసి పైపులైను ద్వారా రిజర్వాయరులోనికి గోదావరి జలాలను అందించాలని కోరారు. 

ఆర్. నారాయణమూర్తి విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. గొలుగొండపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు అంశంపై అధికారులతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ఆర్ నారాయణ మూర్తి హర్షం వ్యక్తం చేశారు. మంచి పరిపాలన అందిస్తున్నారంటూ కితాబిచ్చారు.