అమరావతి: రాష్ట్రమాజీమంత్రి అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని దూషించిన వారు, అనరాని మాటలు అన్నవారు అంతా బలయ్యారని కానీ వారిలో అచ్చెన్నాయుడు మాత్రమే తప్పించుకున్నారంటూ సెటైర్లు వేశారు. 

ప్రస్తుతం తప్పించుకుని నెక్స్ట్  కచ్చితంగా బలవుతారన్నారు. జగన్ మీ పని చూసుకుంటారంటూ విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తామని వైయస్ జగన్ రాసుకో రాసుకో అంటూ తెగ హంగామా చేసిన వ్యక్తి ఎక్కడ ఉన్నారంటూ మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై విరుచుకుపడ్డారు. 

వైయస్ జగన్ ను ప్రతిపక్ష నాయకుడిగా కనీస గౌరవం ఇవ్వకుండా నానా మాటలు మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలకు వెళ్లారని అలాంటి వారంతా ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారంటూ విరుచుకుపడ్డారు. అదృష్టవశాత్తు అచ్చెన్నాయుడు ఒక్కరే తప్పించుకున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

అంబటి పంచ్ లు: పడిపడి నవ్విన సీఎం జగన్