71 % జనాల్లో సంతృప్తి : చంద్రబాబును అధికారులే ముంచేస్తారేమో?

According to officials 71% public are satisfactory on Naidus Government
Highlights

పథకాల అమలుపై జనాల్లో 71 శాతం పూర్తి సంతృప్తిగా ఉన్నారని ఉన్నతాధికారులు చంద్రబాబుకు చెప్పారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని చివరకు అధికారులే పుట్టి ముంచేస్తారేమో ? జనాల్లో సంతృప్తస్ధాయిపై ఉన్నతాధికారులు తాజాగా చంద్రబాబుకు ఇచ్చిన నివేదికలపైన సర్వత్రా అనుమానాలు వస్తున్నాయ్. నివేదికల్లోని అంశాలను చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.  పథకాల అమలుపై జనాల్లో 71 శాతం పూర్తి సంతృప్తిగా ఉన్నారని ఉన్నతాధికారులు చంద్రబాబుకు చెప్పారు.

ఎందుకంటే, క్షేత్రస్ధాయిలో సమస్యలు పరిష్కారమవ్వక నానా అవస్తలు పడుతున్నారు. ఆ విషయం మొన్నటి జన్మభూమి కార్యక్రమంలో స్పష్టంగా కనబడింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జన్మభూమిలో  మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలని చూడకుండా చివరకు అధికారుల మీద కూడా జనాలు ఏ స్ధాయిలో విరుచుకుపడింది అందరూ చూసిందే.

గతంలో చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు కూడా అధికారులే కొంపముంచారు. జనాలకు, సిఎంకు, పార్టీ యంత్రాంగానికి, చంద్రబాబుకు మధ్య అధికారులు ఒక తెరలాగ తయారైనందువల్లే వాస్తవాలను తెలుసుకోలేక, పార్టీ యంత్రాంగం చెప్పిన వినకపోవటం వల్లే ఏకంగా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చింది. ఆ విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు చూడబోతే.

రియలటైం గవర్నన్సె సీఈవో అహ్మద్ బాబు చంద్రబాబుకి ఇచ్చిన నివేదికలు విచిత్రంగా ఉంది. పింఛన్లపై 81 శాతం జనాలు సంతృప్తిగా ఉన్నారట. చంద్రన్నబీమా అమలుపై 97 శాతం, నైపుణ్యాభివృద్ధి శిక్షణపై 98 శాతం, పట్టణ ఇళ్ళ నిర్మాణంపై 60 శాతం జనాలు పూర్తి సంతృప్తితో ఉన్నారట.

జనాలు సమస్యలు చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1100కు రోజువారీగా కొన్ని వేల కాల్స్ వస్తున్నట్లు మంత్రి లోకేష్ స్వయంగా చెప్పారటే అర్ధమేంటి? ఉన్నతాధికారులు ఎప్పుడూ సిఎం ఆలోచనల ప్రకారమే పనిచేస్తారు. కాబట్టే జనాల్లో సంతృప్తి ఆ స్ధాయిలో పెరిగిపోతోంది. రేపటి ఎన్నికల్లో కదా తెలిసిదే జనాల్లోని సంతృప్తి ఏ స్ధాయిలో ఉందో?

loader