పోయిన ఎన్నికల్లో రైతు, డ్వాక్ర సంఘాల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఏం చేసారు? అందరినీ మోసం చేసారు.

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏపి చంద్రబాబునాయుడు గాలి తీసేసారు. సోమవారం మహానాడు సందర్భంగా విశాఖపట్నంలో చంద్రబాబు మాట్లాడిన మాటలపై కెసిఆర్ విరుచుకుపడ్డారు. టిడిపికి చెందిన ఆదిలాబాద్ఏ మాజీ ఎంపి రమేష్ రాథోడ్ తన పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.

ఏపిలో శాస్వతంగాను, తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చంద్రబాబు అన్నారు. అదే విషయమై కెసిఆర్ స్పందిస్తూ, ఆంధ్రాప్రజలను మోసి చేసినందుకు ముందు ఏపి సిఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

పోయిన ఎన్నికల్లో రైతు, డ్వాక్ర సంఘాల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఏం చేసారు? అందరినీ మోసం చేసారు. రుణాలు రద్దు కాకుండానే అయిపోయిందని చెప్పి జనాలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు

.

ప్రజలకు మోసం చేసిన చంద్రబాబుకు తెలంగాణాలో చోటు లేదన్నారు. ఏపిలో ఏం ఊడబీకారని మళ్ళీ తెలంగాణాలో అధికారంలోకి వస్తారని ప్రగల్బాలు పలుకుతున్నారంటూ చంద్రబాబును ఎద్దేవా చేసారు.

తెలంగాణాలో టిడిపి తుడిచిపెట్టుకుపోయిందన్నారు. రైతులకు, డ్వాక్రా గ్రూపులకు శఠగోపం పెట్టిన చంద్రబాబు తెలంగాణాకు వచ్చి చేసేదేముందన్నారు. ఉన్న చోట ప్రజలకు సేవ చేసుకోమంటూ ఎద్దేవా చేసారు.