బార్ కూడా అంత పదిలం కాదు

acb team nabs electricity official red handed in a bar
Highlights

బార్ లో దాక్కున్న ఎసిబి బెడద తప్పలేదు...

బార్  క్షేమం, సురక్షితం అనుకున్నాడాయన. అదికూడా పొద్దునే బార్లుకూర్చుంటే అసలెవరూ చూడనరనుకున్నాడు. అందుకే అవతలిపార్టీని ఏకంగా పొద్దునే బార్ కే రమ్మన్నాడు. అవతలి ఆసామి వచ్చాడు. బాటిల్ ఒపెన్ చేశాడు. ఒక పెగ్గేసుకుందామని గాస్ల్ పట్టుకున్నాడో లేడో... అవినీతి నిరోధక శాఖ అధికారులు ఊడిపడ్డారు. మనోడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇంతకీ జరిగిందేమిటో తెలుసా? పట్టుబడ్డు పెద్దమనిషి దువ్వూరు ధనంజయ. నెల్లూరు జిల్లా ఎ ఎస్ పేట మండలంలొ విద్యుత్ శఆఖ లైన్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్నాడు. శ్రీకొలను అనేగ్రామానికి చెందిన నూక రాజు బలరామిరెడ్డిని ఒ పదివేలు పట్టుకిన బార్ కు రమ్మన్నాడు.ఎందుకో తెలుసా. బలరామిరెడ్డి చేలో బోర్ బావికి కరెంట్ కనెక్షన్ కావాలి. దీనికి దరాఖాస్తు చేసుకున్నాడు. పదివేలిస్తే కనెక్షన్ ఇస్తానన్నాడు. దీనితో రెడ్డి ఎసిసి అధికారులను ఆశ్రయించాడు. పైకి పదివేలు ఇస్తానని ధనంజయకు చెప్పుడు.ధనంజయ్ డడ్బు తీసుకునేందుక బార్ పదిలమనుకున్నాడు. నెల్లూరులోని ఫలానా బార్ రమ్మన్నాడు.ధనంజయ్ లంచం తీసుకునే బార్ ఇదే. అది మద్రాస్ బస్టాండ్ దగ్గిర ఉన్న గౌడ్ బార్ రెస్టరాంట్. ధనంజయ్ డబ్బు దాహంతో బార్ కు వచ్చేటప్పటికి ఎసిసి అధికారులు కూడా వచ్చారు. డబ్బులు చేత పడడానే ఎసిబి డిఎస్ పి పరమేశ్వర్ రెడ్డి బృందం దాడి చేసిన పట్టుకుని నోట్లను పట్టుకుంది.

loader