అమ్మవారి చీరెలు సైతం గల్లంతు: దుర్గగుడి అవకతవకలకు ఆయనే బాధ్యుడు
బెజవాడ కనకదుర్గ ఆలయంలో మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దుర్గ గుడిలో అవకతవకలకు ఈవో సురేష్ బాబు బాధ్యుడిని ఎసీబీ తేల్చినట్లు సమాచారం.
అమరావతి: బెజవాడ కనకదుర్గ ఆలయం అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రికార్డులతో పాటు ఏసీబీ అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దుర్గగుడిలో అక్రమాలకు, అవకతవకలకు ఈవో సురేష్ బాబు కారణమని ఏసీబీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు కనకదుర్గ గుడిలో సోదాలు నిర్వహించారు. అధికారులను, ఉద్యోగులను ప్రశ్నించారు. తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి విచారణ జరిపారు. మూడు రోజుల పాటు తమ కసరత్తు సాగించిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరెలు సైతం మాయమైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తాము స్వాధీనం చేసుకున్న రికార్డులతో పాటు నివేదికను ప్రబుత్వానికి నివేదికను సమర్పిచారు. శానిటేషన్ టెండర్లలోనూ మాక్స్ సంస్థకు సెక్యూరిటీ టెండర్లలోనూ అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రసాదాల స్టోర్స్ లో కూడా లెక్కలు తేలలేదని ఏసీబీ అధికారులు చెప్పారు.
అంతర్గత బదిలీలపై కూడా ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఏసీబీ అదికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి తన పనిని పూర్తి చేశారు. తమకు ఫిర్యాదులు చేస్తే విచారణ జరుపుతామన ఏసీబి అధికారులు చెప్పారు.