బెంగళూరులో కూడా బాగా ఆస్తులు కూడపెట్టి.. బావ మరిదుల పేరున పట్టినట్లు గుర్తించారు. ఇంకా ఆయన భార్య పేరున ఉన్న బ్యాంక్ ఖాతాలు, బంగారు ఆభరణాలను లెక్కించాల్సి ఉందని డీఎస్పీ సాంతో చెప్పారు. అన్నీ కలిపి వంద కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేశారు.
ఏసీబీ అధికారుల వలలో మరో తిమింగళం చిక్కుకుంది. విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి బాలగౌలి మురళీ గౌడ్ అక్రమంగా దాదాపు రూ.100కోట్లు సంపాదించాడు. కాగా.... అతని అక్రమ చిట్టాను ఏసీబీ అధికారులు విప్పారు.
మూడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన ఆస్తులపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నంద్యాల, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడల్లో మొత్తం ఆరు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. నంద్యాలలో 8ఎకరాల పొలం, హైదరాబాద్, నంద్యాలల్లో మూడంతస్తుల భవనాలు రెండు, నంద్యాల, తిరుపతిలో మూడు ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన బ్యాంక్ ఖాతాలో రూ.20లక్షలు ఉండగా... ఆయన బాగా పరిచయం ఉన్న ఓ మహిళ వద్ద రూ.16లక్షలు, ఆయన బావ మరింది ఇంట్లో మరో రూ.16లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులో కూడా బాగా ఆస్తులు కూడపెట్టి.. బావ మరిదుల పేరున పట్టినట్లు గుర్తించారు. ఇంకా ఆయన భార్య పేరున ఉన్న బ్యాంక్ ఖాతాలు, బంగారు ఆభరణాలను లెక్కించాల్సి ఉందని డీఎస్పీ సాంతో చెప్పారు. అన్నీ కలిపి వంద కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేశారు.
విజయవాడ రావడానికి ముందు మురళీగౌడ్ నంద్యాల, తిరుపతిల్లో పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. నంద్యాలకు చెందిన మురళీగౌడ్ పురపాలక శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత ప్రమోషన్ పొంది, తిరుపతిలో అసిస్టెంట్ సిటీప్లానర్‌గా పనిచేశారు. ఆ సమయంలో విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి.
2014లో ఆయన విజయవాడలోని సీఆర్డీఏకు డిప్యూటేషన్‌పై వచ్చారు. వారం క్రితం విజయవాడ నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని తాజాగా ఏసీబీ అధికారులు ఫిర్యాదులు చేపట్టారు. ఏసీబీ నెల్లూరు డీఎస్పీ, తిరుపతి ఇన్‌చార్జి సాంతో ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం విజయవాడ పటమటలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది.
తిరుపతి ద్వారకానగర్‌లోని టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ శారద ఇంట్లో రూ.14 లక్షలను ఏసీబీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అలాగే తిరుపతి రూరల్ పేరూరులోని బిల్లు కలెక్టర్ శ్రీనివాసులురెడ్డి ఇంట్లో 12 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు లభించింది. మురళీగౌడ్‌తో కలిసి వీరు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరి ఇళ్లలోనూ సోదాలు చేశామని ఏసీబీ సీఐ ప్రసాద్‌రెడ్డి చెప్పారు.
