అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

రాష్ట్రంలోని తహాసీల్దార్ కార్యాలయాల్లో  ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రెవిన్యూ కార్యాలయాల్లో  రికార్డులను అధికారులు  సోదాలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, ఎమ్మిగనూరు ఎమ్మార్వో ఆఫీసులపై దాడులు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కారులో రూ.2 లక్షలు లభ్యమయ్యాయి.

విశాఖ జిల్లా కసింకోట గుంటూరు జిల్లా రాజుపాలెం ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు,బలిజపేట ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ సోదాలు  చేశారు. శ్రీకాకుళం జిల్లా గార ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 

రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అవినీతికి దూరంగా పాలన సాగించేందుకు ఏం చేయాలనే విషయమై ఐఐఎం అహ్మదాబాద్ సంస్థ ఇటీవలనే ఏపీ ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఈ నివేదిక సూచనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అవకాశం లేకపోలేదు.అవినీతి ఆరోపణలు రాకుండా ప్రతి శాఖ పనిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.