నగరం లో మరో అవినీతి తిమింగలం acb చేతికి  చిక్కింది. రూ.2కోట్ల లంచం తీసుకుంటూ సహకార శాఖ రిజిస్ట్రార్‌ మల్లికార్జునరావు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కాడు. లబ్ధిదారుడి వద్ద రూ.2కోట్ల లంచం డిమాండ్‌ చేసి అడ్డంగా దొరికిపోయాడు.  

స‌దరు అధికారి న‌గ‌దుకు బ‌దులు భూమి రిజిస్ట్రేష‌న్ చేయించుకుంటుండ‌గా acb అధికారులు చాకచక్యంగా మల్లిఖార్జున రావు ని ప‌ట్టుకున్నారు. సహకార శాఖ రిజిస్ట్రార్ గా పనీచేస్తున్న  మల్లిఖార్జున రావు త‌న ద‌గ్గ‌రికి పనిమీద  వ‌చ్చిన ఓ వ్య‌క్తి నుంచి రూ.2కోట్లు లంచం డిమాండ్ చేశాడు. 

అదీ న‌గ‌దు రూపంలో కాకుండా భూమి రిజిస్ట్రేష‌న్ కి ఒప్పందం చేసుకున్నాడు .లంచం ఇవ్వడం ఇష్టం లేని  బాధితుడి  ఏసీబీ అధికారులను ఆశ్రయించడం తో  విశాఖ టర్నర్ ఛౌల్ట్రీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ భూ రిజిస్ట్రేషన్ సమయంలో  వలపన్ని పట్టుకున్నారు ఈ సంధర్బంగా కేసు వివరాలను acb dsp రంగరాజు మీడియాకి తేలీపారు. 

"