ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా  అబ్దుల్ నజీర్  ఇవాళ ప్రమాణం  చేశారు. 

Abdul nazeer sworn in as Andhra Pradesh Governor

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా  అబ్దుల్ నజీర్  శుక్రవారం నాడు ప్రమాణం  చేశారు.  ఆంధ్రప్రదేశ్  హైకోర్టు చీఫ్ జస్టిస్  ప్రశాంత్ కుమార్  మిశ్రా  ఏపీ గవర్నర్  అబ్దుల్ నజీర్ తో  ప్రమాణం  చేయించారు.  విజయవాడలోని  రాజ్ భవన్ లో   గవర్నర్ అబ్దుల్  నజీర్  ప్రమాణ  స్వీకార కార్యక్రమం  నిర్వహించారు.  ఏపీ గవర్నర్  అబ్దుల్ నజీర్ ప్రమాణ  స్వీకారోత్సవ కార్యక్రమంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్  విపక్ష నేత చంద్రబాబునాయుడు హజరయ్యారు.   ఈ కార్యక్రమంలో  పలువురు మంత్రులు,  అధికారులు,  పలు పార్టీల నేతలు, ప్రముఖులు  పాల్గొన్నారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను   ఛత్తీస్ ఘడ్  రాష్ట్రానికి  ఇటీవల బదిలీ చేశారు. రెండు రోజుల క్రితం గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్  ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి  వెళ్లిపోయారు.  సుప్రీంకోర్టు  జస్టిస్ గా  పనిచేసిన అబ్దుల్ నజీర్ ను  ఏపీ రాష్ట్రానికి  గవర్నర్ గా నియమించారు. దీంతో    ఇవాళ  అబ్దుల్ నజీర్  బాధ్యతలు స్వీకరించారు.

also read:నేడు ఏపీకి రానున్న కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

పలు  కీలక కేసుల తీర్పులను వెలువరించిన  రికార్డు  అబ్దుల్ నజీర్ కు ఉంది.  అయోధ్య, ట్రిపుల్ తలాక్,  నోట్ల రద్దు వంటి  కీలక అంశాలపై   అబ్దుల్ నజీర్  కీలక తీర్పులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి తొలుత  నరసింహన్  గవర్నర్ గా పనిచేశారు. ఆ తర్వాత  బిశ్వభూషణ్  హరిచందన్  ను   ఏపీ గవర్నర్ గా  నియమితులయ్యారు. మూడేళ్ల   తర్వాత  బిశ్వభూషన్ హరిచందన్ ను  ఛత్తీస్ ఘడ్  రాష్ట్రానికి  బదిలీ చేశారు. దీంతో  ఏపీ రాష్ట్రానికి అబ్దుల్ నజీర్ ను  ప్రభుత్వం నియమించింది. 


 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios