తెలుగుదేశం పార్టీ మళ్లీ డ్రామాలు మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు . ఒక చోట బిజేపితో పొత్త‌ట‌, మ‌రోచోట జెండాలు లేకుండా ప్ర‌చార‌మ‌ట.
తెలుగుదేశం పార్టీ మళ్లీ డ్రామాలు మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు వైసీపి నేత బొత్స సత్యనారాయణ. "ఒక చోట బిజేపితో పొత్తట, మరోచోట జెండాలు లేకుండా ప్రచారమట" అని టీడీపీపై ధ్వజమెత్తారు. ఆయన సోమవారం నంద్యాల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఊసరవెల్లి రాజకీయాలను టీడీపీ నేతలు మానుకోవాలని హితువు పలికారు.
చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా మూడున్నర కాలంలో అమలు చేశారా.. అని బొత్స ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి నంద్యాల ప్రచారానికి రావడం సిగ్గుచేటని ఆయన పెర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్లపై చంద్రబాబు మాట తప్పారన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ముంద్రగడ పద్మనాభంను నిర్బంధించి అవమానిస్తున్నారు అని విర్శించారు.
కాకినాడను స్మార్ట్ సిటీగా ప్రకటిస్తూ కేంద్రం రూ.1900 కోట్లు ఇచ్చింది. కానీ చంద్రబాబు ఖర్చు పెట్టింది రూ.5 కోట్లే. కాకినాడను ఎందుకు అభివృద్ధి చేయలేదని చంద్రబాబును నిలదీయాలి. ఆయన అవినీతి దాహం వల్లే అభివృద్ధి జరగడం లేదు’ అని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపి తప్పకుండా విజయం సాధిస్తుందని బొత్స ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తాజా వార్తా విశేషాలకోసం క్లిక్ చేయండి
