ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన ఎనిమిదేళ్ల చిన్నారి వెంకటరమణ హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఓ హత్య కేసులో పోలీసులు విచారణకు పిలవడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

వివరాల్లోకి వెళ్తే ఇటీవలే జిల్లాలోని పెద్ద తాడేపల్లిలో 8ఏళ్ల బాలిక వెంకటరమణ హత్యకు గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారి హత్య కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం తాడేపల్లి గూడెం మండలం నీలాద్రిపురానికి చెందిన ఉప్పలపాటి శ్రీనును పోలీసులు పిలిపించారు.  

పోలీసులు విచారణకు పిలవడంతో భయపడిపోయాడు ఉప్పలపాటి శ్రీను. హత్య కేసులో తాను ఎక్కడ ఇరుక్కుంటానన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇకపోతే వెంకటరమణ తల్లి సెల్ ఫోన్ ను పోలీసులు చెక్ చేశారు. 

కాల్ డేటా మెుత్తం పరిశీలించగా ఉప్పలపాటి శ్రీనుతో ఆమె ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే పోలీసులు తమదైన శైలిలో బాలిక తల్లిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పేసింది. శ్రీనుకి తనకి వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. 

కాల్ డేటా ఆధారంగా బాలిక తల్లితో శ్రీనుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు నిర్థారణకు వచ్చిన పోలీసులు శ్రీనును విచారణకు పిలిచారు. దాంతో భయపడిపోయిన శ్రీను ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ కుటుంబంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

విజయవాడ: చిన్నారి హత్య కేసులో అత్యాచారం కోణం.. మెడపై గోళ్లతో రక్కిన గుర్తులు