Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో 14 మంది ఐపీఎస్ ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీకి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. 14 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో 10 మంది ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు.

A.p. Govt Reshuffled 14 IPS Officers
Author
Amaravathi, First Published Oct 23, 2018, 4:12 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీకి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. 14 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో 10 మంది ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు.

చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ ను గుంటూరు రూరల్ ఎస్పీగా, కడప ఎస్పీగా ఉన్న అట్టాడ బాబూజీని విశాఖ రూరల్ ఎస్పీగా బదిలీ చేసింది. విశాఖ రూరల్ అడిషనల్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగిని నెల్లూరు ఎస్పీగా, విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ ఫకీరప్పను కర్నూలు ఎస్పీగా బదిలీ చేసింది. తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతిని కడప ఎస్పీగా, పార్వతీపురం ఓఎస్డీగా పనిచేస్తున్న విక్రాంతి పాటిల్‌ను చిత్తూరు ఎస్పీగా బదిలీ చేశారు. 


చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్‌ను తిరుపతి అర్బన్‌ ఎస్పీగా, విశాఖ రూరల్‌ ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మను విశాఖ సిట్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెల్లడించింది సర్కార్.  కడప ఎస్పీగా ఉన్న అట్టాడ బాబూజీని విశాఖ రూరల్ ఎస్పీగా బదిలీ చేశారు. వారితోపాటు  గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడును విజయవాడ లా అండ్‌ ఆర్డర్‌ కు, నెల్లూరు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణను సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు బదిలీ చేసింది. 

కడప అడిషనల్‌ ఎస్పీ అద్మాన్‌ నయీం అస్మీన్ కు విశాఖ‌ లా అండ్‌ ఆర్డర్‌ బాధ్యతలు అప్పగించింది. కర్నూల్ ఎస్పీ  గోపినాథ్‌ జెట్టికి టిటిడి సెక్యూరిటీ విజిలెన్స్‌ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్ధ కౌశల్‌ను గుంతకల్‌ రైల్వే ఎస్పీగా, వెయిటింగ్‌లో ఉన్న రవీంద్రనాధ్‌ బాబుకు విశాఖ లా అండ్ ఆర్డర్‌ భాధ్యతలు అప్పగించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios