పాఠశాల విద్యార్థులు మద్యానికి అలవాటు పడుతున్న ఘటనలు ఇటీవల చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఆందోళన కలిగించే ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరంలో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి మందలించిన ఉపాధ్యాయులకు విద్యార్థి రాసిన ఓ లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
గన్నవరం : ఇటీవల జిల్లాలోని ఓ ఉన్నత పాఠశాలకు చెందిన 9th class student విద్యార్థి Liquor తాగి schoolకు వచ్చిన వైనాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. వెంటనే ఆ విద్యార్థి తండ్రిని పిలిపించి మీ అబ్బాయి ప్రవర్తన బాగా లేదని.. అతన్ని మందలించాలంటూ చెప్పారు. అయితే అతను దీనికి సమాధానం చెబతూ.. ‘ఇంటి వద్ద మేము చెబుతున్నా వినడం లేదు.. మీరైనా చెప్పి.. వాడిని మార్చండి’.. అంటూ నిర్లక్ష్యంగా వెళ్లిపోయాడా కన్నతండ్రి. దీంతో teacherలే విద్యార్థిని గట్టిగా మందలించగా అతను ఉపాధ్యాయులకు ఓ letter రాసిచ్చాడు. ఆ విద్యార్థి రాసిచ్చిన లేఖను చూసి ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు.
అందులో ‘నేను రోజుకు క్వాటర్ మద్యం తాగుతా.. పాఠశాలకు సమీపంలోని ఒక దుకాణంలో సిగరెట్లు కొనుక్కుని కాలుస్తున్నా.. పి గన్నవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుక్కుంటున్నా. ఆ డబ్బుల కోసం ఇటుకల బట్టిలో పనికి వెళ్తున్నా.. ఇకమీదట ఇలా చేయను..’ అంటూ పేర్కొన్నాడు. పాఠశాలలో ఐదుగురు వరకు విద్యార్థులు మద్యానికి అలవాటు పడ్డారని, అలాంటివారికి మంచి మాటలు చెబుతుంటే తల్లిదండ్రులే వారిని వెనకేసుకొస్తున్నారు.. అని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ఇదిలా ఉండగా… మార్చి 24న.. స్కూల్ విద్యార్థినులు బస్సులో మద్యం తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే, ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో విద్యార్థినిలు మద్యం తాగుతున్న దృశ్యాలను ఓ విద్యార్థి రికార్డు చేసినట్టుగా భావిస్తున్నారు. ఈ వీడియోలో అమ్మాయిలు, అబ్బాయిల బృందం బీర్ బాటిల్ తెరిచి మద్యం తాగినట్టుగా ఉంది. కొందరు అమ్మాయిలు మద్యం తాగుతున్నట్టుగా కనిపిస్తుండగా.. పక్కనే మరి కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు మద్యం తాగడమే కాకుండా పెద్దగా కేకలు వేస్తూ.. హల్ చల్ చేస్తూ.. కనిపించారు. విద్యార్థులంతా chengalpattuలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా భావిస్తున్నారు.
మొదట ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తర్వాత చాలామంది పాత వీడియోనేమో అనుకున్నారు. అయితే ఈ ఘటన మంగళవారం, మార్చి 22నే చోటు చేసుకుందని పోలీసులు గుర్తించారు. స్కూల్ యూనిఫామ్ ధరించిన విద్యార్థులు తిరుకఝుకుండ్రం నుంచి దాచుర్ కు బస్సులో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని కనుగొన్నారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
చెంగల్పట్టు జిల్లా విద్యాధికారి రోజు నిర్మల స్పందిస్తూ.. ‘ఇది పాఠశాల వెలుపల జరిగింది కాబట్టి పోలీసులు దాని గురించి విచారణ జరుపుతున్నారు. అది ముగిసిన తర్వాత మేము దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని’ తెలిపారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు పలువురు సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు సమాజంలో ఇలాంటి పోకడలు అనర్థాలకు దారితీస్తాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
