ఏపీలో కరోనా కేసులు పడిపోతూనే వున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 97 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,88,275కి చేరింది

ఏపీలో కరోనా కేసులు పడిపోతూనే వున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 97 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,88,275కి చేరింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిన్న కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,158కి చేరింది. గడిచిన 24 గంటల్లో 179 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,80,046కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,071 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 33,876 మందికి కరోనా టెస్టులు చేయడంతో మొత్తం టెస్టుల సంఖ్య 1,32,76,678కి చేరుకుంది.

నిన్న కొత్తగా అనంతపురం జిల్లాలో 6, చిత్తూరు 25, తూర్పుగోదావరి 8, గుంటూరు 7, కడప 6, కృష్ణా 11, కర్నూలు 1, నెల్లూరు 7, ప్రకాశం 3, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 10, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 6 కేసులు చొప్పున నమోదయ్యాయి. 


Scroll to load tweet…