ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు  ప్రమాదం సంభవించింది. నాగులప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో కరెంట్ తీగలు మీద పడటం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా వ్యవసాయ పనులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో రాపర్ల సమీప గ్రామాలకు చెందిన కూలీలు ట్రాక్టర్‌పై పనులకు వెళ్లారు.

పనులు ముగించుకుని ట్రాక్టర్‌పై తిరిగి ఇళ్లకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో టాక్టర్లలో దాదాపు 10 నుంచి 15 మంది వరకు వుండొచ్చని భావిస్తున్నారు.