ఏపీలో కరోనా విశ్వరూపం: కొత్తగా 8,987 కేసులు.. సెకండ్ వేవ్‌లోనే అత్యధికం, 4 జిల్లాల్లో భయానకం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. టెస్ట్ చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి కోవిడ్‌గా నిర్థారణ కావడంతో అధికారులు సైతం ఉలిక్కిపడుతున్నారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా, గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,987 మందికి పాజిటివ్‌గా తేలినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది

8987 new corona cases reported in andhra pradesh ksp

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. టెస్ట్ చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి కోవిడ్‌గా నిర్థారణ కావడంతో అధికారులు సైతం ఉలిక్కిపడుతున్నారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

కాగా, గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,987 మందికి పాజిటివ్‌గా తేలినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెకండ్ వేవ్‌ మొదలైన నాటి నుంచి రాష్ట్రంలో వెలుగుచూసిన రోజువారీ కేసుల్లో ఇవే అత్యధికం. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 9,76,987కి చేరింది.

నిన్న ఒక్కరోజు కరోనా కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 7,472కి చేరింది. నెల్లూరులో 8, చిత్తూరు 5, కడప 5, అనంతపురం 3, కృష్ణ 3, శ్రీకాకుళం 3, కర్నూలు 2, ప్రకాశం 2, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

గడిచిన 24 గంటల్లో 3,116 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,15,626కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 53,889. నిన్న 37,922 మంది శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 1,57,53,679కి చేరుకుంది.

అనంతపురం 275, చిత్తూరు 1,063, తూర్పుగోదావరి 851, గుంటూరు 1,202, కడప 297, కృష్ణా 441, కర్నూలు 758, నెల్లూరు  1,347, ప్రకాశం 305, శ్రీకాకుళం 1344, విశాఖపట్నం 675, విజయనగరం 330, పశ్చిమ గోదావరిలలో 99 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios