నవ మాసాలు మోసిన తల్లికి వృద్ధాప్యంలో అండగా ఉండాల్సింది పోయి కామంతో కళ్లుమూసుకుని మాతృమూర్తిపైనే అత్యాచారయత్నం చేయబోయాడో కుమారుడు.

నవ మాసాలు మోసిన తల్లికి వృద్ధాప్యంలో అండగా ఉండాల్సింది పోయి కామంతో కళ్లుమూసుకుని మాతృమూర్తిపైనే అత్యాచారయత్నం చేయబోయాడో కుమారుడు. వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరులో తల్లీకొడుకులు జీవనం సాగిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తల్లీకి వయసు పైబడటంతో వృద్ధాప్యంతో పాటు అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. 50 ఏళ్ల కుమారుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అఈ క్రమంలో శుక్రవారం మద్యం మత్తులో కామంతో కళ్లు మూసుకుపోయి అమ్మపైనే అత్యాచారయత్నం చేశాడు.

తల్లీ ఏడుస్తూ కాళ్లావేళ్లా పడటంతో ఆమెను వదిలి తెల్లవారుజామున అసోంకు లారీలో వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు సోమవారం ఉదయం ఉయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత వృద్ధురాలిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.