ఏపీలో కోవిడ్ విలయతాండవం: ఒక్కరోజులో 7 వేలకు పైగా కేసులు.. చిత్తూరులో విషమం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు జెట్ స్పీడ్‌తో పెరిగిపోతున్నాయి. ఏ రోజుకారోజు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. పరిస్ధితి చూస్తుంటే మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌లో లాగా మన దగ్గర కూడా లాక్‌డౌన్ , నైట్ కర్ఫ్యూ వంటివి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,224 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

7224 new corona cases reported in andhra pradesh ksp

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు జెట్ స్పీడ్‌తో పెరిగిపోతున్నాయి. ఏ రోజుకారోజు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. పరిస్ధితి చూస్తుంటే మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌లో లాగా మన దగ్గర కూడా లాక్‌డౌన్ , నైట్ కర్ఫ్యూ వంటివి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,224 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 9,55,455కి చేరింది.

కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,388కి చేరింది. వైరస్ వల్ల చిత్తూరులో 4, నెల్లూరు 3, కర్నూలు 2, విశాఖ 2, గుంటూరు, కడప, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

గడిచిన 24 గంటల్లో 2,332 మంది కరోనా నుంచి  కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,07,598కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 40,468 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు 35,907 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 1,56,42,070కి చేరుకుంది. గత 24 గంటల వ్యవధిలో అనంతపురం 420, చిత్తూరు 1,051, తూర్పుగోదావరి 906, గుంటూరు 903, కడప 200, కృష్ణ 493, కర్నూలు 507, నెల్లూరు 624, ప్రకాశం 588, శ్రీకాకుళం 662, విశాఖపట్నం 470, విజయనగరం 304, పశ్చిమ గోదావరిలలో 96 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios