కేబినెట్‌పై జగన్ కసరత్తు: ఏడు నుండి 11 మంది పాత మంత్రులకు మళ్లీ చాన్స్
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఏడుగురు నుండి 11 మందికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు.దీంతో ఆశావహుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సారి కేబినెట్‌లోకి ఎవరిని తీసుకుంటారనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ నాటికి సీఎం YS Jagan కేబినెట్‌లోకి తీసుకొనే వారి పేర్లను Rajbhavan కు పంపనున్నారు.
ఈ నెల 7వ తేదీన Cabinet సమావేశంలోనే ministerతో రాజీనామాలు తీసుకున్నారు సీఎం జగన్.. 24 మంది నుండి రాజీనామా పత్రాలను సీఎం జగన్ తీసుకున్నారు. అయితే అనుభవం దృష్ట్యా ప్రస్తుతం ఉన్న సీనియర్లలో నలుగురైదుగురిని మంత్రివర్గంలో కొనసాగిస్తానని కూడా సీఎం ప్రకటించారు. అయితే నిన్న కేబినెట్ సమావేశం తర్వాత సీఎం జగన్ తన మనసు మార్చుకున్నారని ప్రచారం సాగుతుంది. Resignation చేసిన 24 మంది మంత్రుల్లో ఏడు నుండి 11 మంది మంత్రులను తిరిగి కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఎందరిని కొనసాగిస్తారో, ఎందరికి ఉద్వాసన చెబుతారో దాని ప్రకారంగా 14 నుండి 17 మందికి మంత్రివర్గంలో కొత్తవారికి ఛాన్స్ దక్కనుంది.
కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ కూర్పు ఉండనుంది. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం కోసం జగన్ తన టీమ్ ను సిద్దం చేసుకొంటున్నారు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు గాను మంత్రివర్గం నుండి తప్పించిన వారికి బాధ్యతలు కేటాయింనున్నారు. ప్రభుత్వ పాలన కూడా సమర్ధవంతంగా సాగేందుకు వీలుగా సమర్ధులను మంత్రులగా ఎంచుకోనున్నారు. అనుభవం ఉన్న మంత్రులను కేబినెట్ లో కొనసాగిస్తే రాజకీయంగా ప్రయోజనంగా ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో అనుభవం ఉన్న సీనియర్లను మంత్రిర్గంలో కొనసాగించాలని భావిస్తున్నారు.
ఆయా జిల్లాల్లో ప్రస్తుతం పనిచేసిన మంత్రుల పనితీరుతో పాటు స్థానికంగా ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ కూర్పు ఉండనుంది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గాన్ని జగన్ పునర్వవ్యవస్థీకరించనున్నారు. అయితే మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకొంటారనే విషయమై ఇంకా స్సష్టత లేదు.
2019 లో మంత్రివర్గం ప్రమాణం చేసే సమయంలో రెండున్నర ఏళ్ల తర్వాత కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మంత్రులు కూడా ఈ విషయమై మానసికంగా సిద్దమై ఉన్నారు. ఈ మేరకు మంత్రుల నుండి సీఎం జగన్ మంత్రుల నుంండి రాజీనామాలను తీసుకున్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ లీకైందనే కారణంగా 31 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు.