ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసుల్లో తగ్గుదల నమోదవుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 68 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,88,760కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసుల్లో తగ్గుదల నమోదవుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 68 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,88,760కి చేరింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిన్న ఒక్కరోజు కోవిడ్ వల్ల కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. దీనితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,162కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 814గా వుంది.

గడిచిన 24 గంటల్లో 106 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీరితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,80,784కి చేరింది. నిన్న 30,620 మందికి కోవిడ్ టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 1,34,84,025కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజు అనంతపురం 6, చిత్తూరు 11, తూర్పుగోదావరి 4, గుంటూరు 9, కడప 1, కృష్ణ 7, కర్నూలు 2, నెల్లూరు 7, ప్రకాశం 1, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 15, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 4 కేసుల చొప్పున నమోదయ్యాయి. 


Scroll to load tweet…