ఏపీలో ఏమాత్రం తగ్గని ఉద్ధృతి: ఒక్కరోజులో 6 వేలకు పైగా కేసులు... చిత్తూరులో అదే తీవ్రత

ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలు స్వచ్చంధంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. గుంటూరు- విజయవాడ నగరాల్లో సోమవారం నుంచి జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, పార్క్‌లతో పాటు దుకాణాలు, వాణిజ్య సముదాయాలపైనా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి

6582 new corona cases reported in andhra pradesh ksp


ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలు స్వచ్చంధంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. గుంటూరు- విజయవాడ నగరాల్లో సోమవారం నుంచి జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, పార్క్‌లతో పాటు దుకాణాలు, వాణిజ్య సముదాయాలపైనా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

తాజాగా గడిచిన 24 గంటల్లో 6,582 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ  ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,62,037కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు కరోనా వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 7,410కి చేరుకుంది. చిత్తూరులో 5, కృష్ణ 4, నెల్లూరు 4, కర్నూల్ 3, అనంతపురం 2, గుంటూరు 2, విశాఖ, విజయనగరంలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 2,343 మంది కోలుకున్నారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9,09,941కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 44,686 మంది చికిత్స పొందుతున్నారు.  

నిన్న ఒక్కరోజు 35,922 మంది శాంపిల్స్ పరీక్షంచగా.. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 1,56,77,992కి చేరుకుంది. గత 24 గంటల వ్యవధిలో అనంతపురం 305, చిత్తూరు 1,171, తూర్పుగోదావరి 100, గుంటూరు 804, కడప 203, కృష్ణా 465, కర్నూలు 729, నెల్లూరు 597, ప్రకాశం 314, శ్రీకాకుళం 912, విశాఖపట్నం 551, విజయనగరం 349, పశ్చిమ గోదావరిలలో 82 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios