ఏపీలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 620 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,67,683కి చేరింది. నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా ఏడుగురు చనిపోవడంతో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 6,988కి చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 8,397 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 3,787 మంది కరోనా నుంచి కోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,52,298కి చేరుకుంది. నిన్న రాష్ట్రంలో 54,710 మంది శాంపిల్స్ పరీక్షంచడంతో ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య 1,00,17,126కి చేరింది.

గత 24 గంటల్లో అనంతపురం 16, చిత్తూరు 64, తూర్పుగోదావరి 40, గుంటూరు 101, కడప 48, కృష్ణా 85, కర్నూలు 15, నెల్లూరు 39, ప్రకాశం 19, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 36, విజయనగరం 35, పశ్చిమ గోదావరిలలో 107 కేసులు నమోదయ్యాయి.

అలాగే కోవిడ్ వల్ల కృష్ణ, విశాఖపట్నం, చిత్తూరులలో ఇద్దరు చొప్పున.. గుంటూరు, పశ్చిమ గోదావరిలలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.