ఏపీలో కరోనా వైరస్ జోరు కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 6,133 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,93,484కి చేరుకుంది. 

ఏపీలో కరోనా వైరస్ జోరు కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 6,133 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,93,484కి చేరుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 48 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,828కి చేరింది. గడిచిన 24 గంటల్లో 7,075 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,29,211కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 58,445 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 71,806 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 58,06,558కి చేరింది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 580, చిత్తూరు 925, తూర్పు గోదావరి 983, గుంటూరు 498, కడప 387, కృష్ణ 446, కర్నూలు 216, నెల్లూరు 415, ప్రకాశం 324, శ్రీకాకుళం 362, విశాఖపట్నం 235, విజయనగరం 298, పశ్చిమ గోదావరిలలో 464 కేసులు నమోదయ్యాయి.

అలాగే చిత్తూరు 8, ప్రకాశం 6, తూర్పుగోదావరి 5, కృష్ణ 5, విశాఖపట్నం 5, అనంతపురం 4, గుంటూరు 4, పశ్చిమ గోదావరి 4, కడప 3, కర్నూలు 2, నెల్లూరు, విజయనగరంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

Scroll to load tweet…