ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (Andhra Pradesh Legislative Council) నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను (tdp mlcs) ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్టుగా చైర్మన్ మోషేనురాజు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (Andhra Pradesh Legislative Council) నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను (tdp mlcs) ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్టుగా చైర్మన్ మోషేనురాజు ప్రకటించారు. జంగారెడ్డిగూడెం మరణాలతో పాటు ఇతర అంశాలపై టీడీపీ సభ్యులు మండలిలో నిరసన వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలు.. సహజ మరణాలు కావని.. ప్రభుత్వ హత్యలేనని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సభలో గందళగోళం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వచ్చిన నిరనస తెలుపడాన్ని చైర్మన్ మోషేనురాజు తప్పుబట్టారు. పెద్దల సభలో ఇలా చేయడం సరికాదన్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్సీలను బచ్చల అర్జునుడు, దీపక్ రెడ్డి, పరుచూరి అశోక్ బాబు, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, దువ్వారపు రామారావు, అంగర రామ్మోహన్ ఒక్క రోజు పాటు సస్పెండ్ చేయాలని మంత్రి అప్పలరాజు తీర్మానం ప్రవేశపెట్టగా.. తీర్మానం పాస్ అయినట్లు మండలి చైర్మన్ మోషేనురాజు ప్రకటించారు. ప్రతిపాదించిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అనంతరం శాసనమండలి గురువారానికి వాయిదా పడింది.
ఇక, శాసనసభ నుంచి ఐదుగురు TDP ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ Tamineni Sitaram ప్రకటించారు.బుధవారం నాడు ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత Jangareddy Gudem మరణాలపై చర్చను కోరుతూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. చిడతలు వాయిస్తూ టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యులేనా మీరు అంటూ ఆయన ఫైరయ్యారు. మీకు ఓటేసిన సభ్యులు మిమ్మల్ని గమనిస్తున్నారని స్పీకర్ చెప్పారు.
జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చకు ఇవాళ కూడా ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. చడతలు పట్టుకొని నిరసనకు దిగారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయాలని పలువురు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించడంపై స్పీకర్ టీడీపీ సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీలో ఇవాళ టీడీపీ సభ్యులు చిడతలు వాయించిన అంశాన్ని ఎథిక్స్ కమిటీ ముందుకు తీసుకు వెళ్లనున్నారు. నిన్న ఏపీ అసెంబ్లీలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు విజిల్ వేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన అంశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును స్పీకర్ తప్పు బట్టారు.ఈ రెండు అంశాలను అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.