గోదావరిలో పడవ మునక: ఇంకా ఆచూకీ లభ్యం కాని ఏడుగురు, కొనసాగుతున్న సహాయక చర్యలు

6 Girls, Woman Still Missing After Andhra Boat Capsize, Rescue Ops On
Highlights

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద శనివారం సాయంత్రం గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో  గల్లంతైన ఏడురురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. 

కాకినాడ:తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద శనివారం సాయంత్రం గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో  గల్లంతైన ఏడురురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గోదావరి కొట్టుకుపోయిన ఏడుగురి కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది  విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రెండు బృందాలుగా విడిపోయి గల్లంతైన వారి కోసం గత ఈతగాళ్లు గాలిస్తున్నారు. భారీ వర్షం, ఈదురుగాలులు సహాయక చర్యలకు అడ్డంకులు సృష్టిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక‌మొండి వద్ద శనివారం నాడు  పడవ బోల్తా పడిన ఘటనలో  ఏడుగురు గల్లంతయ్యారు.  గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.యానాం దిగువ, ఎగువ ప్రాంతాల్లో కూడ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎఫ్‌టీఆర్‌ఎఫ్‌, నేవీ తూర్పుగోదావరి జిల్లా పోలీసు, అగ్నిమాపక బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. 

గోదావరి లంక గ్రామాల్లోని ప్రజలకు సరుకులు తెచ్చుకోవాలన్నా... స్కూలుకు వెళ్లాలన్నా  పడవ ద్వారానే గోదావరిని దాటాల్సిన పరిస్థితులున్నాయి. గోదావరిపై బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ బ్రిడ్జి పనులు  కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జి పూర్తైతే ఈ ప్రాంతంలోని లంకవాసుల కష్టాలు తీరుతాయి.  గల్లంతైన ఏడుగురిలో ఆరుగురు విద్యార్ధినులు, ఓ గృహిణి ఉన్నారు. 

గల్లంతయిన విద్యార్థులంతా శేరిలంక, కమిని, సలాదివారిపాలెం, వలసలతిప్ప, సీతారాంపురం గ్రామాలకు చెందిన ప్రియ, మనీషా, సుచిత్ర, అనూష, శ్రీజ, రమ్య, దుర్గగా గుర్తించారు. ఎగువ నుండి వరద ఉధృతి కారణంగా  గోదావరిలో పడవ బోల్తా పడిందని అధికారులు తేల్చారు. 

పెద్దలు మృతి చెందినవారితే రూ.5 లక్షలు, పిల్లలకు రూ.3 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రామచంద్రాపురం నియోజకవర్గంలోని మూడు లంక గ్రామాల ప్రజలు  పడవల ద్వారానే గోదావరిని దాటుతున్నారు.  అయితే ఈ మూడు గ్రామాలకు వెళ్లేందుకు అవసరమైన బ్రిడ్జి నిర్మాణాలను చేపడుతున్నట్టు  డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు.

ఎన్డీఆర్ఎప్,ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు గజ ఈతగాళ్లు  రెండు బృందాలుగా విడిపోయి  సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అయితే ఇంతవరకు ఏడురరి ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదు.

loader